Tuesday, February 22, 2011

Gaalikadupu ledu


గాలికదుపు లేదు
కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో
ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది
ఆగేదేనా (2)

ఆ నింగిలో మబ్బునై
పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై
ఆడనా ఆటలు ఎన్నో (2)

తుళ్ళి తుళ్ళి గంతులువేసే
లేళ్ళకేది కట్టుబాటు
మళ్ళి మళ్ళి వసంతమొస్తే
మల్లె కేల ఆకు చాతు

గాలికదుపు లేదు
కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో
ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది
ఆగేదేనా

ఓ తెమ్మెర ఊపవే
ఊహల ఊయల నన్ను
ఓ మల్లిక ఇవ్వవే
నవ్వుల మాలిక నాకు

తల్లి మళ్ళి తరుణయ్యింది
పువ్వు పూచి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక
గుడిలో ప్రమిదనయితే తప్పేముంది

గాలికదుపు లేదు
కడలికంతు లేదు
గంగ వెల్లువ కమండలంలో
ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది
ఆగేదేనా
http://www.youtube.com/watch?v=JFgNKn-WhKY

0 comments: