ఆమని పాడవే హాయిగా
ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక పదాల నా ఎద స్వరాల సంపద తరాల నా కధ క్షణాలదే కదా గతించిపోవు గాధ నేనని ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో శుఖాలతో,పికాలతో ధ్వనించిన మధూదయం దివి భువి కల నిజం స్పృశించిన మహొదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోని గాధ నేనని ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో http://www.youtube.com/watch?v=Cwv8I4-2gRY