Posts

Showing posts from January, 2008

Chinuku laa raali....

Image
చినుకులా రాలి,నదులుగా సాగి,వరదలై పోయి,కడలిగా పొంగు... నీ ప్రేమా...నా ప్రేమా..నీ పేరే నా ప్రేమా.. నదివి నీవు,కడలి నేను మరచి పోబోకుమా..మమత నీవే సుమా... ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టుర్పులే కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఒదార్పులే ప్రేమలు కోరే జన్మలలోనె నే వేచి ఉంటానులే జన్మలు దాటే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే హిమములా రాలి, సుమములై పూసి,రుతువులై నవ్వి ,మధువులై పొంగు ...నీ ప్రేమ..నా ప్రేమా ..నీ పేరే నా ప్రేమా శిశిరమైన, శిధిలమైన విడిచి పోబోకుమా.... విరహమై పోకుమా తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే పులకరముగే పువ్వుల కొసం వేసారుతున్నానులే నింగికి నేల అంకితలాడే ఆ పొద్దు రావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే తీరాలు చేరాలిలే మౌనమై మెరిసి. గానమై పిలిచి,కలలతో అలసి,గగనమై ఎగసే ...నీ ప్రేమా...నా ప్రేమా..తారాడే మన ప్రేమా ... భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా..ప్రేమా మనమే సుమా.. చినుకులా రాలి,నదులుగా సాగి,వరదలై పోయి,కడలిగా పొంగు నీ ప్రేమా...నా ప్రేమా..నీ పేరే నా ప్రేమా.. http://youtube.com/watch?v=zJ1vLDQNbos

Rajamahendri

Image
Adi kavi nannaya veeresaalingam pantulu Godavari matha Vedamanti maa godaari వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం రాజరాజ నరేంద్రుడు,కాకతీయులు,తేజమున్న మేటిదొరలు రెడ్డి రాజులు , నరపతులు సురపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు ఆది కవిత నన్నయ్య రాసేనిచ్చట శ్రీనాధ కవి నివాసము పెద్ద ముచ్చట కవి సౌర్వభావులకిది ఆలవాలము నవ కవితలు వికసించే నందనవనము దిట్టమైన శిల్పాల దేవళాలు కట్టుకధల చిత్రాంగి కనక మేడలు కొట్టుకుని పొయెను కొన్ని కోటిలింగాలు విరేశలింగమొకడు మిగిలెను చాలు వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం