Posts

Showing posts from 2009

అలై పొంగెరా కన్నా

Image
అలై పొంగెరా కన్నా మానసమలై పొంగేరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగేరా నీ నవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదొరా ప్రాయమున యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే కన్నె మోమున కనుబొమ్మలతో పొంగే కాదిలి వేణుగానం కానడ పలికే కాదిలి వేణుగానం కానడ పలికే కన్నె వయసు కళలొలికె వేళలో కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా నిషాంత మహీత శకుంతమరంద మెడారి గళాన వర్షించవా ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలే రచించవా కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో ఇది తగునో యెద తగువో ఇది ధర్మం అవునో కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ అలై పొంగెరా కన్నా మానసమలై పొంగేరా http://www.youtube.com/watch?v=TtiXXOGtS7s

ఆమని పాడవే హాయిగా

Image
ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక పదాల నా ఎద స్వరాల సంపద తరాల నా కధ క్షణాలదే కదా గతించిపోవు గాధ నేనని ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో శుఖాలతో,పికాలతో ధ్వనించిన మధూదయం దివి భువి కల నిజం స్పృశించిన మహొదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోని గాధ నేనని ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో http://www.youtube.com/watch?v=Cwv8I4-2gRY

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని

Image
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంతే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో ఏమో ఎమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంతే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగ నిత్యం పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తుంది ఇదే పాట గుండెల్లో సదా మ్రోగుతుంది నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవెరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంతే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకు మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు ఎటెల్లేదో జీవితం నువ్వే లేకపొతే ఎడారిగ మారేదో నువ్వే రాకపొతే నువ్వు,నీ నవ్వు నాతో లేకుంటే నేనంటు ఉంటానా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వర

ఉరుములు నీ మువ్వలై

Image
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని మెలకల మందాకిని కులుకుల బృందావని కనులకు విందీయవే ఆ అందాన్ని చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెల మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మ్రోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా కల్యాణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని నడయాడే నీ పాదం నట వేదమేనంటు ఈ పుడమే పులకించగా నీ పెదవే తనకోసం అనువైన కొలువంటు సంగీతం నిను చేరగా మా గుండెనే శృతి చేయవా నీ వీణగా ఈ గాలిలో నీ వేలితో రాగాలు ఎన్నో రేగేవేలా నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగులై సాగేవేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ

Image
శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... నటనాంజలితో బ్రతుకును తరించనీవా సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రికి వరించకే సంధ్య సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... తన వేళ్ళే సంకెళ్ళై కదల లేని మొక్కలా ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా అవధి లేని అందముంది అవనికి నలు దిక్క

మనసే అందాల బృందావనం

Image
మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం కమ్మని నగుమోము కాంచుటే తొలినోము కడగంటి చూపైన కడు పావనం మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం రాధను ఒక వంక లాలించునే సత్యభామనూ మురిపాల తేలించునే రాధను ఒక వంక లాలించునే సత్యభామనూ మురిపాల తేలించునే మనసార నెరనమ్ము తన వారిని ఆ ఆ ఆఆ ఆఅ ఆఆఆ ఆఅ మనసార నెరనమ్ము తన వారిని కోటి మరులందు సుధలందు తనియించెనే మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం http://www.youtube.com/watch?v=3_yM-boo3pA

నేనా పాడనా పాట...

Image
నేనా పాడనా పాట మీరా అన్నదీ మాట నేనా పాడనా పాట మీరా అన్నదీ మాట నీ వదనం భూపాలము నీ హృదయం ధృవ తాళము నీ సహనం సాహిత్యము నువ్వు పాడిందే సంగీతము నేనా పాడనా పాట మీరా అన్నదీ మాట ఇల్లే సంగీతము వంటిల్లే సాహిత్యము ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం ఇల్లే సంగీతము వంటిల్లే సాహిత్యము ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం ఊగే ఉయ్యాలకు నువ్వు పాడే జంపాలకు ఊగే ఉయ్యాలకు నువ్వు పాడే జంపాలకి సరితూగదు ఏ గానము నీకు ఎందుకు సందేహము నీకు ఎందుకు సందేహము ఉడకని అందానికి నీకొచ్చే కోపానికి ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా ఉడకని అందానికి నీకొచ్చే కోపానికి ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా కుతకుత వరి అన్నం తైతకతక మను నాత్యం ఏ భరతుడు రాసిందో నీకా పదునెటు తెలిసిందో నేనా పాడనా పాట మీరా అన్నదీ మాట నీ వదనం భూపాలము నీ హృదయం ధృవ తాళము నీ సహనం సాహిత్యము నువ్వు పాడిందే సంగీతము http://www.youtube.com/watch?v=tbfRqrZOyOk

వాసంత సమీరంలా... నునువెచ్చని గ్రీష్మంలా...

Image
Ruthuraagaalu...ee serial dooradarshan lo oka 7 years vachindhi...intlo,college lo andharu tega interesting gaa chuse vallu...maa hostel lo unna dokku tv ee serial time lo thappa eppudu kaaligaa undedhi...aa time lo matram almost hostel mottam akkade undevaaru...nenu ee song kosam velledhaanni...enni saarlu vinna malli malli vinalanipistundhi endhuko...ee song lo every word bhale baaguntundhanipistundhi naaku... వాసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా ఒక శ్రావణ మేఘంలా ఒక శ్రావణ మేఘంలా శరత్చంద్రికల కలలా హేమంత తుషారంలా నవ శిశిర తరంగంలా కాలం ధ్యానం లయలో కలల అలల సవ్వడిలో కాలం ధ్యానం లయలో కలల అలల సవ్వడిలో సాగే జీవన గానం అణువణువున ఋతురాగం సాగే జీవన గానం అణువణువున ఋతురాగం వాసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా http://www.youtube.com/watch?v=GU0nHCa6AQU

ఎపుడు నీకు నే తెలుపనిది

Image
Male: ఎపుడు నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం వెతికే తీరమే రానంది బతికే దారినే మూసింది రగిలే నిన్నలేనా నాకు సొంతం సమయం చేదుగా నవ్వింది హృదయం బాధగా చూసింది నిజమే నీడగా మారింది ఓ ఓ ఎపుడు నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతి చోట జీవితం నీవని గురుతు చేసావు ప్రతి పూట ఒంటిగా బ్రతకలేనంటు వెంట తరిమావు ఇన్నాళ్ళు మెలకువే రాని కలగంటు గడపమన్నావు నూరేళ్ళు ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే కాని ఊపిరిగ సొంతం కాదా Female: ఎపుడు నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం వెతికే తీరమే రానంది బతికే దారినే మూసింది రగిలే నిన్నలేనా నాకు సొంతం సమయం చేదుగా నవ్వింది హృదయం బాధగా చూసింది నిజమే నీడగా మారింది ఓ ఓ ఎపుడు నీకు నే తెలుపనిది ఇకపై ఎవరికీ తెలియనిది మనసే మోయగలదా జీవితాంతం గుండెలో ఆశనే తెలుపనేలేదు నా మౌనం చూపులో బాషనే చదవనేలేదు నీ స్నేహం తలపులో నువ్వు కొలువున్న కలుసుకోలేను ఎదరున్నా తెలిసి ఈ తప్పు చేస్తున్న అడగవే ఒక్కసారైన నేస్తమా నీ పరిచయం కల కరిగించేటి కన్నీటి వానే కాదా http://www.dishant.com/jukebox.php?s

లాలి లాలి లాలి లాలి......

Image
లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ఆఆఆ మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి కల్యాణ రామునికి కౌసల్య లాలి కల్యాణ రామునికి కౌసల్య లాలి యదువంశ విభునికి యశొద లాలి యదువంశ విభునికి యశొద లాలి కరిరాజ నుతునికి ఈఈఈఈ కరిరాజ నుతునికి గిరితనయ లాలి కరిరాజ నుతునికి గిరితనయ లాలి పరమాత్మభవునికి పరమాత్మ లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి జో జో జో జో జో జో జో జో జో జో అలమేలు పతికి అన్నమయ్య లాలి అలమేలు పతికి అన్నమయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి శ్యామలాంగుడికి శ్యామయ్య లాలి శ్యామలాంగుడికి శ్యామయ్య లాలి ఆగమ నుతునికి త్యాగయ్య లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి లాలి లాలి లాలి లాలి htt

లాలి లాలి అని రాగం సాగుతుంటే.....

Image
లాలి లాలి అని రాగం సాగుతుంటే ఎవరు నిదుర పోరే చిన్నబోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే అంత చేదా మరి వేణుగానం కళ్ళు మేలుకుంటె కాలమాగుతుందా భారమైన మనసా పగటి బాధలన్ని మరచిపోవుటకు ఉంది కదా ఈ ఏకాంత వేళ లాలి లాలి అని రాగం సాగుతుంటే ఎవరు నిదుర పోరే చిన్నబోదా మరి చిన్ని ప్రాణం ఎటో పోయేటి నీలిమేఘం వర్షం చిలికి వెళ్ళగా ఏదో అంటుంది కోయిల పాట రాగం ఆలకించి సాగా అన్ని వైపులా మధువనం పూలు పూయగా అనుక్షణం అణువణువునా జీవితం అందజేయదా అమృతం లాలి లాలి అని రాగం సాగుతుంటే ఎవరు నిదుర పోరే చిన్నబోదా మరి చిన్ని ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే అంత చేదా మరి వేణుగానం http://www.youtube.com/watch?v=bakiuU4kM7Y

జగతి సిగలో జాబిలమ్మకు వందనం

Image
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇది I love India I love India I love India I love India తకిట తకధిమి తకిట తక తరిగిట తకధిమి తకిటతోం ధింధిన ధినధిన తకిటధిం తకిట తకధిం తకధిం ధిన ధిధిన తకిటధీం తరిగిట తరిగిట తకధీంతోం గంగ యమునలు సంఘమించిన గానమా కూచిపూడికి కులుకు నేర్పిన నాత్యమా అజంతాలా కజురహొలా సంపదలతో సొంపులొలికే భారతి జయహొ మంగళం మాతరం I love India I love India I love India I love India జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం తాజమహలే ప్రణయజీవుల పావురం తందారె దారే దారే తందారే దారే కృషవేణి శిల్ప రమణి నర్తనం తందానినా తరరారారి నా వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతి జయహొ మంగళం మాతరం I love India I love India I love India I love India జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం వందేమాతరం http://www.dishant.com/jukebox.php?songid=17066

కలిసే ప్రతి సంధ్యలో

Image
కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో నాత్యాలన్ని కరగాలి నీలో నేనే మిగలాలి నాత్యాలన్ని కరగాలి నీలో నేనే మిగలాలి కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో పొంగిపోదా సాగరాత్మ నింగికి చేరుకోదా చంద్ర హృదయం నీటికి పొంగిపోదా సాగరాత్మ నింగికి చేరుకోదా చంద్ర హృదయం నీటికి సృష్టి లోనా ఉన్నదీ బంధమే అల్లుకుంది అంతటా అందమే తొనికే బిడియం తొలగాలి వణికే అధరం పిలవాలి కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో మేనితోనే ఆగుతాయి ముద్రలు గుండెదాక సాగుతాయి ముద్దులు మేనితోనే ఆగుతాయి ముద్రలు గుండెదాక సాగుతాయి ముద్దులు ఇంత తీపి కొంతగా పంచుకో వెన్నెలంత కళ్ళలో నింపుకో బ్రతుకే జతగా పారాలి పరువం తీరం చేరాలి కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో కలిసే ప్రతి సంధ్యలో పలికే ప్రతి అందెలో నాత్యాలెన్నో ఎదగాలి నాలో నేనే మిగలాలి కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో http://www.chimatamusic.com/playcmd.php?plist=12442

జగమంత కుటుంబం నాది

Image
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాలో నేను అనుభ్రమిస్తూ ఒంటరినై అనవరతం ఉంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నెల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే అనుక్రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాన్ని కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది http://www.youtube.com/watch?v=hOmRFJ1hqVQ

ప్రేమ జీవన నాదం

Image
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి ఈ దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం తీయని భావాల రాగ సరాగ మంత్రం విరిసెను అంతులేని ఆనందం తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి ఈ దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం స గ మ ద మ గ స గ మ ద ని మ గ ద మ ద ని స ద ని మ ద స ఆడే మయూర మాల పురి విప్పి సంతసాన విరిసెను పూలలో గారాలీవేళ మధువులు కురిసే పెదవుల లోనా మధుర స్వరాలు సాగేనీవేళ ఓ గండు కోయిల జత కోరి పాడింధి అది విని ఆడింది ఓ కన్నె కోయిల తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి ఈ దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం నక్షత్ర మాల నేడు ఆకాశ వీధిలోన కాంతుల విరి వాన కురిపించేనులే కలలే రగిలి అలలై కదిలి ఊహలు నాలోన ఉరికేనులే హంసలు జత చేరి ఆనందమున తేలి మనసారా విహరించె మధురిమలో తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి ఈ దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం తీయని భావాల రాగ సరాగ మంత్రం విరిసెను అంతులేని ఆనందం తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమ

నా గొంతు శృతిలోనా

Image
నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మజన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మజన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా ఒకమాట పది మాటలై అది పాట కావాలని ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని కడలిలో అలలుగా ..కడలేని కలలుగా నిలిచిపోవాలని......... పాడవే పాడవే కొయిల పాడుతు పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలని ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని వలపులే రెక్కలుగా.. వెలుగులే దిక్కులుగా ఎగరిపోవాలని ........... పాడవే పాడవే కొయిల పాడుతు పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మజన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా http://www.youtube.com/watch?v=9LNv-WzYZQg

కన్నె పిల్లవని కన్నులున్నవని

Image
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి సంగీతం నీవయితే సాహిత్యం నేనవుతా సంగీతం నీవయితే సాహిత్యం నేనవుతా కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి స్వరము నీవై స్వరమున పదము నేనై గానం గీతం కాగా... కవిని నేనై నాలో కవిత నీవై కావ్యమైనది తలపు పలుకు మనసు కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి తనన తనన అన్నా తాన అన్నా తాళం ఒకటే కదా తననతాన తాననన తాన పదము చేర్చి పాట కూర్చ లేదా దనిని దసస అన్నా నీద అన్నా స్వరమే రాగం కాదా నీవు నేనని అన్నా మనమే కాదా నీవు నేనని అన్న మనమే కాదా కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి

మనసా...నా మనసా

Image
మనసా నా మనసా మాటాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా మనసా నా మనసా మాటాడమ్మా చెవిలో మంగళవాద్యం మ్రోగేటి వేళలో విన్నా నీ అనురాగపు తేనె పాటని... మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో చూసా నీతో సాగే పూల బాటని... నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ మనసా నా మనసా మాటాడమ్మా తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైన అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా తనువు మనసు ప్రాణం నీవైన రోజున నాదని వేరే ఏది మిగిలి లేదుగా ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక ఇదిగో ఇది నది అంటు చూపగలరా ఇంక నీవు లేని లోకమింక నాకు ఉండదంటూ మనసా నా మనసా మాటాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా

తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు

Image
శ్రీమాన్ మాహారాజా మార్తాండ తేజ ప్రియానంద భోజా మీ శ్రీచరనాంభూజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో చాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభముహుర్తాన... తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలు ఎన్నెన్నో కధలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో,,,, నిదురపోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక ఇన్నాళ్ళకు రాస్తున్నా ప్రేమలేఖ తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలు ఎన్నెన్నో కధలు ఏ తల్లి కుమారులో తెలియదు కాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగధీరులో తెలియలేదు కాని నా మనసును దోచిన చోరులు మీరు వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగ భావించి చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి

ఆనందం

Image
చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం ఆశల జండా ఎగరేసే స్వాతంత్ర్యం ఆనందం చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం ఊరించే ఊహల్లో ఊరేగడమే ఆనందం కవ్వించే కల కోసం వేటాడమే ఆనందం అలలై ఎగసే ఆనందం అలుపే తెలియని ఆనందం ఎదరేమున్న ఎవరేమన్నా దూసుకుపోతూ ఉంటే ఆనందం చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం ప్రతి అందం మనకోసం అనుకోవటమే ఆనందం రుచి చూద్దాం అనుకుంటే చేదైనా అది ఆనందం ప్రేమించటమే ఆనందం Fail అవ్వటమే ఆనందం కలలే కంటూ నిజమనుకుంటూ గడిపే కాలం ఎంతో ఆనందం చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం ఆశల జండా ఎగరేసే స్వాతంత్ర్యం ఆనందం