జగమంత కుటుంబం నాది


జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

సంసార సాగరం నాదే
సన్యాసం శూన్యం నాదే

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో

పన్నీటి జయ గీతాల
కన్నీటి జలపాతాల

నాతో నేను అనుగమిస్తూ
నాలో నేను అనుభ్రమిస్తూ

ఒంటరినై అనవరతం ఉంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని
కావ్య కన్నెల్ని ఆడపిల్లల్ని

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై

నాతో నేను సహగమిస్తూ
నాతో నేనే అనుక్రమిస్తూ

ఒంటరినై ప్రతి నిమిషం
కంటున్నాను నిరంతరం

కిరణాల్ని కిరణాల
హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల
చలనాల కనరాని గమ్యాన్ని
కాలాన్ని ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

http://www.youtube.com/watch?v=hOmRFJ1hqVQ

Comments

Unknown said…
It is a nice and neat song.

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki