ప్రేమ జీవన నాదం


ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం
అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం

తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం
అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం

స గ మ ద మ గ స
గ మ ద ని మ గ ద
మ ద ని స ద ని మ ద స

ఆడే మయూర మాల పురి విప్పి సంతసాన
విరిసెను పూలలో గారాలీవేళ
మధువులు కురిసే పెదవుల లోనా
మధుర స్వరాలు సాగేనీవేళ

ఓ గండు కోయిల జత కోరి పాడింధి
అది విని ఆడింది ఓ కన్నె కోయిల
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం

నక్షత్ర మాల నేడు ఆకాశ వీధిలోన
కాంతుల విరి వాన కురిపించేనులే
కలలే రగిలి అలలై కదిలి
ఊహలు నాలోన ఉరికేనులే

హంసలు జత చేరి ఆనందమున తేలి
మనసారా విహరించె మధురిమలో
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం
అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం

తీయని భావాల రాగ సరాగ మంత్రం
విరిసెను అంతులేని ఆనందం
తలపులే రాగాలు పాడాలి నేడు
తలపులే రాగాలు పాడాలి నేడు

ప్రేమ జీవన నాదం
పంచమం ఈ వేదం
సాగాలి ఈ దినం
అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Eppudu oppukovaddura otami...

janaki ramula kalyananiki