కన్నె పిల్లవని కన్నులున్నవని


కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్ని కలలు రప్పించావే పొన్నారి

సంగీతం నీవయితే సాహిత్యం నేనవుతా
సంగీతం నీవయితే సాహిత్యం నేనవుతా

కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్ని కలలు రప్పించావే పొన్నారి

స్వరము నీవై స్వరమున పదము నేనై
గానం గీతం కాగా...
కవిని నేనై నాలో కవిత నీవై
కావ్యమైనది తలపు పలుకు మనసు

కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్ని కలలు రప్పించావే పొన్నారి

తనన తనన అన్నా తాన అన్నా
తాళం ఒకటే కదా
తననతాన తాననన తాన
పదము చేర్చి పాట కూర్చ లేదా

దనిని దసస అన్నా నీద అన్నా
స్వరమే రాగం కాదా

నీవు నేనని అన్నా మనమే కాదా
నీవు నేనని అన్న మనమే కాదా

కన్నెపిల్లవని కన్నులున్నవని
ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
ఎన్ని కలలు రప్పించావే పొన్నారి

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu