తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు


శ్రీమాన్ మాహారాజా మార్తాండ తేజ
ప్రియానంద భోజా మీ శ్రీచరనాంభూజములకు
ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి
ఎన్నో కలలు కన్న కన్నె బంగారు
భయముతో భక్తితో అనురక్తితో
చాయంగల విన్నపములు

సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభముహుర్తాన...

తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలు ఎన్నెన్నో కధలు

జో అచ్యుతానంద జో జో ముకుంద
లాలి పరమానంద రామ గోవింద జో జో,,,,

నిదురపోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా ప్రేమలేఖ

తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలు ఎన్నెన్నో కధలు

ఏ తల్లి కుమారులో తెలియదు కాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగధీరులో తెలియలేదు కాని
నా మనసును దోచిన చోరులు మీరు

వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటే మన్నించి ఒప్పులుగ భావించి
చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu