ఎపుడు నీకు నే తెలుపనిది


Male:
ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం

వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం

సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది ఓ ఓ

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం

జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతి చోట
జీవితం నీవని గురుతు చేసావు ప్రతి పూట
ఒంటిగా బ్రతకలేనంటు వెంట తరిమావు ఇన్నాళ్ళు
మెలకువే రాని కలగంటు గడపమన్నావు నూరేళ్ళు

ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే కాని ఊపిరిగ సొంతం కాదా

Female:

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం

వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం

సమయం చేదుగా నవ్వింది
హృదయం బాధగా చూసింది
నిజమే నీడగా మారింది ఓ ఓ

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం

గుండెలో ఆశనే తెలుపనేలేదు నా మౌనం
చూపులో బాషనే చదవనేలేదు నీ స్నేహం
తలపులో నువ్వు కొలువున్న కలుసుకోలేను ఎదరున్నా
తెలిసి ఈ తప్పు చేస్తున్న అడగవే ఒక్కసారైన
నేస్తమా నీ పరిచయం కల కరిగించేటి కన్నీటి వానే కాదా
http://www.dishant.com/jukebox.php?songid=17495

http://www.dishant.com/jukebox.php?songid=17491

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu