లాలి లాలి అని రాగం సాగుతుంటే.....


లాలి లాలి అని రాగం సాగుతుంటే
ఎవరు నిదుర పోరే
చిన్నబోదా మరి చిన్ని ప్రాణం

కాసే వెన్నెలకు వీచే గాలులకు
హృదయం కుదుటపడదే
అంత చేదా మరి వేణుగానం

కళ్ళు మేలుకుంటె కాలమాగుతుందా
భారమైన మనసా
పగటి బాధలన్ని మరచిపోవుటకు
ఉంది కదా ఈ ఏకాంత వేళ

లాలి లాలి అని రాగం సాగుతుంటే
ఎవరు నిదుర పోరే
చిన్నబోదా మరి చిన్ని ప్రాణం

ఎటో పోయేటి నీలిమేఘం వర్షం చిలికి వెళ్ళగా
ఏదో అంటుంది కోయిల పాట రాగం ఆలకించి సాగా

అన్ని వైపులా మధువనం
పూలు పూయగా అనుక్షణం
అణువణువునా జీవితం
అందజేయదా అమృతం

లాలి లాలి అని రాగం సాగుతుంటే
ఎవరు నిదుర పోరే
చిన్నబోదా మరి చిన్ని ప్రాణం

కాసే వెన్నెలకు వీచే గాలులకు
హృదయం కుదుటపడదే
అంత చేదా మరి వేణుగానం


http://www.youtube.com/watch?v=bakiuU4kM7Y

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki