Chinuku laa raali....


చినుకులా రాలి,నదులుగా సాగి,వరదలై పోయి,కడలిగా పొంగు... నీ ప్రేమా...నా ప్రేమా..నీ పేరే నా ప్రేమా..
నదివి నీవు,కడలి నేను మరచి పోబోకుమా..మమత నీవే సుమా...

ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టుర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఒదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనె నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే

హిమములా రాలి, సుమములై పూసి,రుతువులై నవ్వి ,మధువులై పొంగు ...నీ ప్రేమ..నా ప్రేమా ..నీ పేరే నా ప్రేమా
శిశిరమైన, శిధిలమైన విడిచి పోబోకుమా.... విరహమై పోకుమా

తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరముగే పువ్వుల కొసం వేసారుతున్నానులే
నింగికి నేల అంకితలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
తీరాలు చేరాలిలే

మౌనమై మెరిసి. గానమై పిలిచి,కలలతో అలసి,గగనమై ఎగసే ...నీ ప్రేమా...నా ప్రేమా..తారాడే మన ప్రేమా ...
భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా..ప్రేమా మనమే సుమా..

చినుకులా రాలి,నదులుగా సాగి,వరదలై పోయి,కడలిగా పొంగు నీ ప్రేమా...నా ప్రేమా..నీ పేరే నా ప్రేమా..
http://youtube.com/watch?v=zJ1vLDQNbos

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Eppudu oppukovaddura otami...