Posts

Showing posts from July, 2009

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని

Image
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంతే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో ఏమో ఎమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంతే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగ నిత్యం పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తుంది ఇదే పాట గుండెల్లో సదా మ్రోగుతుంది నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవెరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంతే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకు మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు ఎటెల్లేదో జీవితం నువ్వే లేకపొతే ఎడారిగ మారేదో నువ్వే రాకపొతే నువ్వు,నీ నవ్వు నాతో లేకుంటే నేనంటు ఉంటానా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వర

ఉరుములు నీ మువ్వలై

Image
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని మెలకల మందాకిని కులుకుల బృందావని కనులకు విందీయవే ఆ అందాన్ని చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెల మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మ్రోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా కల్యాణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని నడయాడే నీ పాదం నట వేదమేనంటు ఈ పుడమే పులకించగా నీ పెదవే తనకోసం అనువైన కొలువంటు సంగీతం నిను చేరగా మా గుండెనే శృతి చేయవా నీ వీణగా ఈ గాలిలో నీ వేలితో రాగాలు ఎన్నో రేగేవేలా నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగులై సాగేవేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్