అలై పొంగెరా కన్నా
అలై పొంగెరా కన్నా మానసమలై పొంగేరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగేరా నీ నవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదొరా ప్రాయమున యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే కన్నె మోమున కనుబొమ్మలతో పొంగే కాదిలి వేణుగానం కానడ పలికే కాదిలి వేణుగానం కానడ పలికే కన్నె వయసు కళలొలికె వేళలో కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా నిషాంత మహీత శకుంతమరంద మెడారి గళాన వర్షించవా ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలే రచించవా కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో ఇది తగునో యెద తగువో ఇది ధర్మం అవునో కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ అలై పొంగెరా కన్నా మానసమలై పొంగేరా http://www.youtube.com/watch?v=TtiXXOGtS7s