Atisayame

పూవుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం
ఆ సీతకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిలపాటే అతిశయం

అతిశయమే అచ్చెరువొందే నీవేనా అతిశయం

ఆ గిరులు ఈ తరులు ఏఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ..
పదహారు ప్రాయాన పరువంలో అందరికిపుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ..

పూవుల్లొ..........

ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి పూలవాసన అతిశయమే
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా వాననీరు అతిశయమే
విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల వెలిగేటి మిణుగురులతిశయమే

తనువులో ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణంలోనా ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే

ఆ గిరులు ఈ తరులు ఏఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ..
పదహారు ప్రాయాన పరువంలో అందరికిపుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ..

పూవుల్లొ.......

అల వెన్నెలంటి ఒకతీని ఇరు కాళ్ళంటా నడిచొస్తే నీవేనా అతిశయము
జగమున అతిశయాలు ఏడేనా ఓ మాట్లాడే పువ్వా నువు ఎనిమిదొవ అతిశయము
నింగిలాటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు తేనెలూరే అధరాలు అతిశయమే
మగువ చేతివేళ్ళు అతిశయమే
మకుటాలంటి గోళ్ళు అతిశయమే
కదిలే వంపులు అతిశయమే

ఆ గిరులు ఈ తరులు ఏఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ..
పదహారు ప్రాయాన పరువంలో అందరికిపుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ..
http://youtube.com/watch?v=3y5GZC3ZkrA

Comments

Raghu said…
puvvllo dagunna pallento atisayam.....

not kallento atisayam....

tappu pattalani kadu...just correcting....

btw nice work...