Posts

Showing posts with the label Mudda mandaaram

Aliveni Animutyamaa

Image
అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వు జాజి దండలు అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో స్వాతివాన లేత ఎండలో జాజి మల్లి పూల దండలు అలివేణి ఆణిముత్యమా కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి నుదుట ముద్దు పెట్టనా ముద్దుగా వద్దంటే ఒట్టుగా అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అడుగు మడుగులొత్తనా మెత్తగా అవునంటే తప్పుగా అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి పొగడ దండలల్లుకోనా పూజలా పులకింతల పూజగా తొలిజన్మల నోముకి దొరనవ్వుల సామికి తొలిజన్మల నోముకి దొరనవ్వుల సామికి చెలిమై నేనుండిపోనా చల్లగా మరుమల్లెలు చల్లగా అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వు జాజి దండలు అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా http://telugusongs.allindiansite.com/mudda_mandaram.html