Posts

Showing posts with the label Uyyala jampala

Konda gaali tirigindi

Image
కొండగాలి తిరిగింది(2) గుండె ఊసులాడింది గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది ఆఅ ఆఆ ఆఅ ఆఅ... పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది(2) గట్టు మీద కన్నె లేడి గంతులేసి ఆడింది పట్ట పగలు సిరివెన్నెల భరతనాత్య మాడింది పట్టరాని లేత వలపు పరవశించి పాడింది (2) కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది ఆఅ ఆఆ ఆఅ ఆఅ... మొగలి పూల వాసనతో జగతి మురిసి పొయింది(2) నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది(2) ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది ఆఅ ఆఆ ఆఅ ఆఅ... http://www.youtube.com/watch?v=O7uTZmz9fBw