Ninne ninne koraa


నిన్నే నిన్నే కోరా
నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో
నన్నే మరచా (2)

ప్రతి జన్మలోనా నీ ప్రేమలోనా
ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా

నచ్చావే నచ్చావులే
హో
నచ్చావే నచ్చావులే

అనుకొని అనుకోగానే
సరాసరి ఎదురౌతావు
వేరే పనే లేదా నీకు
నన్నే వదలవు

నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేనే నిన్ను నేను గుర్తురానే నాకు నేను
ఈ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగ

నిన్నే నిన్నే కోరా
నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో
నన్నే మరచా

నీతో ఏదో చెప్పాలంటు
పదే పదే అనిపిస్తుంది
పెదాలలో మౌనం నన్నే
ఆపేస్తున్నది

మనసునేమో దాచమంటే అస్సలేమి దాచుకోదు
నిన్ను చూసి పొద్దు పోదు చూడకుంటే ఆశపోదు
ఈ వైనం ఇంతకాలం నాలోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం బరించేదెలా

నిన్నే నిన్నే కోరా
నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో
నన్నే మరచా (2)

ప్రతి జన్మలోనా నీ ప్రేమలోనా
ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా

నచ్చావే నచ్చావులే
హో
నచ్చావే నచ్చావులే

http://www.youtube.com/watch?v=zgKhE2JIK5U

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Eppudu oppukovaddura otami...

janaki ramula kalyananiki