raagaala pallakilo koyilamma


రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా
రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా
రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా

పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకి
మూగ తీగ పలికించే వీణలమ్మకి
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకి
మూగ తీగ పలికించే వీణలమ్మకి
బహుసా అది తెలుసో ఏమో ఉహు హు ఉహు హు హు
బహుసా అది తెలుసో ఏమో జాణ కోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ

రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ
అందుకేనా అందుకేనా........

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు
కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు
బహుసా తను ఎందుకనేమో ల ల ల లల లాలాలాలా
బహుసా తను ఎందుకనేమో గడుసు కోయిలా
రాలేదు ఈ తోటకి ఈ వేళ

రాగాల పల్లకిలో కోయిలమ్మా రానేలా నీవుంటే కూనలమ్మా
రాగాల పల్లకిలో కోయిలమ్మా రానేలా నీవుంటే కూనలమ్మా

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Eppudu oppukovaddura otami...

janaki ramula kalyananiki