Naa pedavulu nuvvayithe


నా పెదవులు నువ్వయితే
నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వయితే
కల నేనవుతా

నా పాదం నువ్వయితే
నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వయితే
వెలుగే అవుతా

చెరోసగం అయ్యాం కదా ఒకే పదానికి
ఇలా మనం జతై సగం శిలాక్షరం అవ్వాలి ప్రేమకి

నా పెదవులు నువ్వయితే
నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వయితే
కల నేనవుతా

నా పాదం నువ్వయితే
నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వయితే
వెలుగే అవుతా

కనిపించని బాణం నేనయితే...
తియ తియని గాయం నేనవుతా
వెంటాడే వేగం నేనయితే...
నేనెదురవుతా

వినిపించని గానం నేనయితే...
కవి రాయని గేయం నేనవుతా
శ్రుతిమించే రాగం నేనయితే...
జతి నేనవుతా

దివి తాకే నిచ్చెన నేనయితే...
దిగివచే నెచ్చెలి నేనవుతా
నిను మలిచే ఉలినే నేనయితే...
నీ ఊహలు ఊపిరి పోసే చక్కని బొమ్మను నేనవుతా

నా పెదవులు నువ్వయితే
నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వయితే
కల నేనవుతా

నా పాదం నువ్వయితే
నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వయితే
వెలుగే అవుతా

వేదించే వేసవి నేనయితే...
లాలించే వెన్నెల నేనవుతా
ముంచెత్తే మత్తుని నేనయితే ...
మైమరపవుతా

నువ్వోపని భారం నేనయితే...
నిన్నాపని గారం నేనవుతా
నిను కమ్మే కోరిక నేనయితే...
రారమ్మంటా

వణికించే మంటను నేనయితే...
జ్వలియించే జంటను నేనవుతా
పదునెక్కిన పంటిని నేనయితే...
ఎరుపెక్కిన చెక్కిలి పంచే చెక్కెర విందే నేనవుతా
నా పెదవులు నువ్వయితే
నీ నవ్వులు నేనవుతా
నా కన్నులు నువ్వయితే
కల నేనవుతా

నా పాదం నువ్వయితే
నీ అడుగులు నేనవుతా
నా చూపులు నువ్వయితే
వెలుగే అవుతా

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Eppudu oppukovaddura otami...

janaki ramula kalyananiki