జామురాతిరి జాబిలమ్మ


జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మా జారనీయకే కలా

వయారి వాలు కళ్ళలోనా
వరాల వెండి పూల వాన
స్వరాల ఊయలూగు వేళ

జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా

కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిలకిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా

కునుకురాక బుట్టబొమ్మ గుబులుగుందని
వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ

జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా

మనసులో భయాలన్ని మరచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ
నిదురతో నిషారాణి నడిచిపో

చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి

జామురాతిరి జాబిలమ్మా జోల పాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మా జారనీయకే కలా

వయారి వాలు కళ్ళలోనా
వరాల వెండి పూల వాన
స్వరాల ఊయలూగు వేళ

http://www.youtube.com/watch?v=ic0RSSIsAlY

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki