Posts

Showing posts from March, 2009

జగమంత కుటుంబం నాది

Image
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాలో నేను అనుభ్రమిస్తూ ఒంటరినై అనవరతం ఉంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నెల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే అనుక్రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాన్ని కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది http://www.youtube.com/watch?v=hOmRFJ1hqVQ

ప్రేమ జీవన నాదం

Image
ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి ఈ దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం తీయని భావాల రాగ సరాగ మంత్రం విరిసెను అంతులేని ఆనందం తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి ఈ దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం స గ మ ద మ గ స గ మ ద ని మ గ ద మ ద ని స ద ని మ ద స ఆడే మయూర మాల పురి విప్పి సంతసాన విరిసెను పూలలో గారాలీవేళ మధువులు కురిసే పెదవుల లోనా మధుర స్వరాలు సాగేనీవేళ ఓ గండు కోయిల జత కోరి పాడింధి అది విని ఆడింది ఓ కన్నె కోయిల తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి ఈ దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం నక్షత్ర మాల నేడు ఆకాశ వీధిలోన కాంతుల విరి వాన కురిపించేనులే కలలే రగిలి అలలై కదిలి ఊహలు నాలోన ఉరికేనులే హంసలు జత చేరి ఆనందమున తేలి మనసారా విహరించె మధురిమలో తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం సాగాలి ఈ దినం అనురాగ బంధం ప్రేమ జీవన నాదం తీయని భావాల రాగ సరాగ మంత్రం విరిసెను అంతులేని ఆనందం తలపులే రాగాలు పాడాలి నేడు తలపులే రాగాలు పాడాలి నేడు ప్రేమ జీవన నాదం పంచమ

నా గొంతు శృతిలోనా

Image
నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మజన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మజన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా ఒకమాట పది మాటలై అది పాట కావాలని ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని కడలిలో అలలుగా ..కడలేని కలలుగా నిలిచిపోవాలని......... పాడవే పాడవే కొయిల పాడుతు పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలని ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని వలపులే రెక్కలుగా.. వెలుగులే దిక్కులుగా ఎగరిపోవాలని ........... పాడవే పాడవే కొయిల పాడుతు పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మజన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా http://www.youtube.com/watch?v=9LNv-WzYZQg