chinni chinni aasa


చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నలకు తోడై ఆడుకోను ఆశ

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

పూవులా నేను నవ్వుకోవాలి
గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేక చిందులేయాలి
వేడుకలలోనా తేలిపోవాలి
తూరుపు రేఖ వెలుగుకావాలి

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

చేనులో నేనే పైరుకావాలి
కొలనులో నేనే ఆలను కావాలి
నింగి హరివిల్లు వంచి bచూడాలి
మంచు తెరలోనె నిదురపోవాలి
చైత్ర మాసంలో చినుకు కావాలి

చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ

http://youtube.com/watch?v=0zeq_1IIlYM

Comments

Anonymous said…
very nice song... good work...

Popular posts from this blog

Teliyani raagam palikindi

Eppudu oppukovaddura otami...

janaki ramula kalyananiki