Posts

Jallanta kavvinta kaavalile

Image
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరకలు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే వాగులు వంకలు జలజల చిలిపిగా పిలిచినా గాలులు వానలు చిటపట చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరో తనువు దాగదు అదేమి తాకిడో కోనచాటు కొండవల్లే లేనివంక ముద్దులాడి వెళ్ళడాయే కళ్ళులేని దేవుడెందుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరకలు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలపగా తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా వాన దేవుడే కళ్ళాపి జల్లగా మాయ దేవుడే ముగ్గెసి వెళ్ళగా నీలిమంట గుండెలోఅని ఆశలన్ని తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరికోసమో జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరకలు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపుల ఉలికిపడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే http://youtube.com/watch?v=NP6F9ApUZ2w

Ghallu ghallumani sirimuvvalle

Image
ఘల్లుఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా ఝల్లుఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లుఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా ఝల్లుఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ నిలువెల్ల మంచు వడగల్లు తాకి కడగల్లే తీరని జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లుఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరగా ఝల్లుఝల్లుమని పులకింతల్లో పుడమే పాడగా రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపని అన్నెం పున్నెం ఎరుగని మా సీమకి రా రమ్మని ఆహ్వానం అందించనీ మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వనీ చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లనీ ఆశా సుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్ని అల్లనీ ఈ వేళ జడి వాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకరా ఆకశాన్నె ఇల దించరాకురిసే వానగా మారని యాతన తీర్చగా మా తల రాతలు మార్చగా ఈ జల య...

Raama chakkani seetaki

Image
నీల గగనా ఘనవిచలనా ధరణిజా శ్రీ రమణ మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకి ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటె చూడలేదని పెదవి చెప్పె చెప్పలేమని కనులు చెప్పే నల్లపూసైనాడు దేవుడు నల్లనీ రఘురాముడు రామ చక్కని సీతకి చుక్కనడిగా దిక్కునడిగా చేమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచె చూసుకోమని మనసు తెలిపె మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక యెవరు మొగుడంట ఇందువదనా కుందరదనా మందగమనా భామా ఎందువలన ఇందువదనా ఇంతమదనా ప్రేమా

Oosulaade oka jaabilata

Image
ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట అందాలే చిందె చెలి రూపం నా కోసం ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం అదే పేరు నేను జపించేను రొజూ ననే చూసేటి వేళ అలై పొంగుతాను మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట నాలోన రేగేనే పాట చెలి పాట నీడల్లే సాగే నీ వెంట తన వెంట స్వరాలై పొంగేనా వరాలే కోరేనా ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా ఒకటై ఆడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడు ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట చూపులతో బాణమేసెనట చెలి నా ఎదలో సెగ రేపెనట మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా నను తాకెనట http://www.youtube.com/watch?v=u-7-kiecEBo

Allanta dooraala

Image
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలికా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా కన్యాదానం గా ఈ సంపద చేపట్టే వరుడు శ్రీహరి కాదా పొందాలనుకున్నా పొందే వీలుందా ' అందరికి అందనిది ఈ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవదా అందానికే అందమనిపించగా దిగి వచ్చెనో ఏమొ దివి కానుక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీయక ఎన్నో వొంపుల్తో పొంగే ఈళ్ళని తనేమదిని ముంచిందో ఎవరికి ఎరుక తొలి పరిచయమొక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా http://www.youtube.com/watch?v=__7Lvcd5kzE

Haayigaa undadhaa

Image
హాయిగా ఉండదా ప్రేమనే భావన మనసుతో మనసుకే వేయదా వంతెన కదిలే వెలుగుల వెంట మమతే వెలుగై రాదా కనుపాపకి రెప్పలా కాపలా కాయదా పెదవంచుపై నవ్వులా సంతకం చేయదా ఈ ప్రేమ లోతెంతని అడగద్దు ఓ మిత్రమా ఈ ప్రేమ ఘన చరితని వర్ణించటం సాధ్యమా హాయిగా ఉండదా ప్రేమనే భావన మనసుతో మనసుకే వేయదా వంతెన మనసంటూ నీకుంటే అది ఇచ్చేటందుకే ప్రేమంటు ఒకటుంది అది పంచేటందుకే ప్రేమించేందుకొక క్షణమే చాలు మొదలవుతుంధి తొలి సంబరం ప్రేమను మరచి పోదాము అంటే సరిపోదేమో ఈ జీవితం జత కలసి కనులు కనులు ప్రతిదినము కలలు మొదలు ఒక చినుకులాగ మొదలయిన ప్రేమ అంతలో సంద్రమై పొంగదా ఆపాలన్నా అనచాలన్నా వీలే కాదుగా హాయిగా ఉండదా ప్రేమనే భావన మనసుతో మనసుకే వేయదా వంతెన ఎదనిండా ప్రేముంటే ఏముంది కానిది కలకాలం తోడుండే గుణమేగా ప్రేమది చుట్టం లాగ వచ్చెళ్ళిపోయే మజిలి కాదు ప్రేమది గుండెల్లోకి ఓ సారి వస్తే గుమ్మం దాటి పోదే ఇది ఇక ఒకరినొకరు తలచి బ్రతికుండలేరు విడిచి అసలైన ప్రేమ రుజువైన చోట ఇక అనుదినం అద్భుతం జరగదా నీకేం కాదు నేనున్నానని హామి ఇవ్వదా హయీగా ఉండదా ప్రేమనే భావన మనసుతో మనసుకే వేయదా వంతెన నిజమైన ప్రేమంటే ఏ స్వార్ధం లేనిది కస్టాన్నే ఇస్టంగా భావిస్తానంటది పంచేకొ...

Gama gama hungaama

Image
గామగామ హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని కాలి చేద్దామా గామగామ హంగామా కస్టం ఖర్చుపెడదామా కొత్త సంతోషం జమ చేద్దామా నీ రాకతో రాయిలాంటి నా జీవితానికి జీవం వచ్చింది నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది చేయూతతో శిల్పం కాస్తా నడకలు నేర్చి కోవెల చేరింది నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పం లోనే కోరిక పెరిగింది ఆ కొరికేమిటో చెప్పనీ నను వీది నువ్వు వెళ్ళొద్దని మళ్ళీ రాయిని చేయ్యొద్దని గామగామ హంగామా మనమే హాయి చిరునామా పాత బాధ గదిని కాలి చేద్దామా నీ మాటతో నాపై నాకే తెలియని నమ్మకమొచ్చింది నీ స్పూర్తితో ఎంతో ఎంతో సాదించాలని తపనే పెరిగింది నీ చెలిమితో ఊహల్లోనా ఊరిస్తున్నా గెలుపే అందింది ఆ గెలుపుతో నిస్పృహ లోన నిదురిస్తున్న మనసే మురిసింది ఆ మనసు అలసిపోదని ఈ చెలిమి నిలిచిపోవాలని ఇలా బ్రతుకుని గెలవాలని http://www.youtube.com/watch?v=UYRhWiJEyG8