Posts

ఆమని పాడవే హాయిగా

Image
ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక పదాల నా ఎద స్వరాల సంపద తరాల నా కధ క్షణాలదే కదా గతించిపోవు గాధ నేనని ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో శుఖాలతో,పికాలతో ధ్వనించిన మధూదయం దివి భువి కల నిజం స్పృశించిన మహొదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోని గాధ నేనని ఆమని పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో http://www.youtube.com/watch?v=Cwv8I4-2gRY

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని

Image
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంతే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో ఏమో ఎమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంతే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగ నిత్యం పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తుంది ఇదే పాట గుండెల్లో సదా మ్రోగుతుంది నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవెరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంతే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకు మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు ఎటెల్లేదో జీవితం నువ్వే లేకపొతే ఎడారిగ మారేదో నువ్వే రాకపొతే నువ్వు,నీ నవ్వు నాతో లేకుంటే నేనంటు ఉంటానా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వర...

ఉరుములు నీ మువ్వలై

Image
ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నేల తకధిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని మెలకల మందాకిని కులుకుల బృందావని కనులకు విందీయవే ఆ అందాన్ని చంద్రుల్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి మా కళ్ళల్లో వెలిగించవే సిరివెన్నెల మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మ్రోగే వేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా కల్యాణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని నడయాడే నీ పాదం నట వేదమేనంటు ఈ పుడమే పులకించగా నీ పెదవే తనకోసం అనువైన కొలువంటు సంగీతం నిను చేరగా మా గుండెనే శృతి చేయవా నీ వీణగా ఈ గాలిలో నీ వేలితో రాగాలు ఎన్నో రేగేవేలా నీ మేనిలో హరివిల్లులే వర్ణాల వాగులై సాగేవేళ ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్...

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ

Image
శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... నటనాంజలితో బ్రతుకును తరించనీవా సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మది కోరిన మధుసీమలు వరించి రావా పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రికి వరించకే సంధ్య సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ.... తన వేళ్ళే సంకెళ్ళై కదల లేని మొక్కలా ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా అవధి లేని అందముంది అవనికి నలు దిక్క...

మనసే అందాల బృందావనం

Image
మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం కమ్మని నగుమోము కాంచుటే తొలినోము కడగంటి చూపైన కడు పావనం మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం రాధను ఒక వంక లాలించునే సత్యభామనూ మురిపాల తేలించునే రాధను ఒక వంక లాలించునే సత్యభామనూ మురిపాల తేలించునే మనసార నెరనమ్ము తన వారిని ఆ ఆ ఆఆ ఆఅ ఆఆఆ ఆఅ మనసార నెరనమ్ము తన వారిని కోటి మరులందు సుధలందు తనియించెనే మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం http://www.youtube.com/watch?v=3_yM-boo3pA

నేనా పాడనా పాట...

Image
నేనా పాడనా పాట మీరా అన్నదీ మాట నేనా పాడనా పాట మీరా అన్నదీ మాట నీ వదనం భూపాలము నీ హృదయం ధృవ తాళము నీ సహనం సాహిత్యము నువ్వు పాడిందే సంగీతము నేనా పాడనా పాట మీరా అన్నదీ మాట ఇల్లే సంగీతము వంటిల్లే సాహిత్యము ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం ఇల్లే సంగీతము వంటిల్లే సాహిత్యము ఈ పిల్లలే నా సాధనం ఇంకా వింటారా నా గానం ఊగే ఉయ్యాలకు నువ్వు పాడే జంపాలకు ఊగే ఉయ్యాలకు నువ్వు పాడే జంపాలకి సరితూగదు ఏ గానము నీకు ఎందుకు సందేహము నీకు ఎందుకు సందేహము ఉడకని అందానికి నీకొచ్చే కోపానికి ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా ఉడకని అందానికి నీకొచ్చే కోపానికి ఏ రాగం బాగుండునో చెప్పే త్యాగయ్య మీరేగా కుతకుత వరి అన్నం తైతకతక మను నాత్యం ఏ భరతుడు రాసిందో నీకా పదునెటు తెలిసిందో నేనా పాడనా పాట మీరా అన్నదీ మాట నీ వదనం భూపాలము నీ హృదయం ధృవ తాళము నీ సహనం సాహిత్యము నువ్వు పాడిందే సంగీతము http://www.youtube.com/watch?v=tbfRqrZOyOk

వాసంత సమీరంలా... నునువెచ్చని గ్రీష్మంలా...

Image
Ruthuraagaalu...ee serial dooradarshan lo oka 7 years vachindhi...intlo,college lo andharu tega interesting gaa chuse vallu...maa hostel lo unna dokku tv ee serial time lo thappa eppudu kaaligaa undedhi...aa time lo matram almost hostel mottam akkade undevaaru...nenu ee song kosam velledhaanni...enni saarlu vinna malli malli vinalanipistundhi endhuko...ee song lo every word bhale baaguntundhanipistundhi naaku... వాసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా ఒక శ్రావణ మేఘంలా ఒక శ్రావణ మేఘంలా శరత్చంద్రికల కలలా హేమంత తుషారంలా నవ శిశిర తరంగంలా కాలం ధ్యానం లయలో కలల అలల సవ్వడిలో కాలం ధ్యానం లయలో కలల అలల సవ్వడిలో సాగే జీవన గానం అణువణువున ఋతురాగం సాగే జీవన గానం అణువణువున ఋతురాగం వాసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా http://www.youtube.com/watch?v=GU0nHCa6AQU