Nenani neevani


నేనని నీవని వేరుగా లేమని
చెప్పిన వినరా ఒక్కరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం... ఇప్పుడెదురయ్యే సత్యం
తెలిస్తే ......
అడ్డుకోగలదా వేగం ..కొత్త బంగారు లోకం
పిలిస్తే .....

మొదటిసారి మదిని చేరి నిదుర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో గుట్టుగా అనేటట్టుగా
ఇది నీ మాయేనా

నేనని నీవని వేరుగా లేమని
చెప్పిన వినరా ఒక్కరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం ..ఇప్పుడెదురయ్యే సత్యం
తెలిస్తే ......
అడ్డుకోగలదా వేగం... కొత్త బంగారు లోకం
పిలిస్తే .....

పదము నాది పరువు నీది
ప్రధము నీవే ప్రియతమా
తనువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషొత్తమా

నువ్వే దారిగా నేనే చేరగాఎటు చూడక
వెనువెంటే రాగా..
నేనని నీవని వేరుగా లేమని
చెప్పిన వినరా ఒక్కరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం... ఇప్పుడెదురయ్యే సత్యం
తెలిస్తే ......
అడ్డుకోగలదా వేగం.... కొత్త బంగారు లోకం
పిలిస్తే .....

http://www.youtube.com/watch?v=SwlLQNgkjCo

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu