Nijamga nenenaa


నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరె హరెహరె హరెహరె రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా
ఏమ్మా ...

హరె హరెహరె హరెహరె రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా
ఏమ్మా ...

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

ఈ వయస్సులో ఒక్కోక్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం

అడుగులలోనా అడుగులు వేస్తూ
నదిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మదుగా

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే
నా గతాలనే కవ్వింతలే పిలుస్తు ఉంటే
నీ వరాలుగ ఉల్లాసమే కురుస్తు ఉంటే

పెదవికి చెంప తగిలిన చోట
పరవశమేదో తోడవుతుంటే

పగలే అయినా గగనం లోన
తారలు చేరెనుగా

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరె హరెహరె హరెహరె రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా
ఏమ్మా ...

హరె హరెహరె హరెహరె రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా
ఏమ్మా ...

http://www.youtube.com/watch?v=YzqCStYKL1s

Comments

kiran darisi said…
pata balega vundhi andi

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki