Posts

Showing posts from January, 2009

కన్నె పిల్లవని కన్నులున్నవని

Image
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి సంగీతం నీవయితే సాహిత్యం నేనవుతా సంగీతం నీవయితే సాహిత్యం నేనవుతా కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి స్వరము నీవై స్వరమున పదము నేనై గానం గీతం కాగా... కవిని నేనై నాలో కవిత నీవై కావ్యమైనది తలపు పలుకు మనసు కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి తనన తనన అన్నా తాన అన్నా తాళం ఒకటే కదా తననతాన తాననన తాన పదము చేర్చి పాట కూర్చ లేదా దనిని దసస అన్నా నీద అన్నా స్వరమే రాగం కాదా నీవు నేనని అన్నా మనమే కాదా నీవు నేనని అన్న మనమే కాదా కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి

మనసా...నా మనసా

Image
మనసా నా మనసా మాటాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా మనసా నా మనసా మాటాడమ్మా చెవిలో మంగళవాద్యం మ్రోగేటి వేళలో విన్నా నీ అనురాగపు తేనె పాటని... మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో చూసా నీతో సాగే పూల బాటని... నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ మనసా నా మనసా మాటాడమ్మా తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైన అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా తనువు మనసు ప్రాణం నీవైన రోజున నాదని వేరే ఏది మిగిలి లేదుగా ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక ఇదిగో ఇది నది అంటు చూపగలరా ఇంక నీవు లేని లోకమింక నాకు ఉండదంటూ మనసా నా మనసా మాటాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా

తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు

Image
శ్రీమాన్ మాహారాజా మార్తాండ తేజ ప్రియానంద భోజా మీ శ్రీచరనాంభూజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో చాయంగల విన్నపములు సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభముహుర్తాన... తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలు ఎన్నెన్నో కధలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో,,,, నిదురపోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక ఇన్నాళ్ళకు రాస్తున్నా ప్రేమలేఖ తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలు ఎన్నెన్నో కధలు ఏ తల్లి కుమారులో తెలియదు కాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకు ఎంతటి మగధీరులో తెలియలేదు కాని నా మనసును దోచిన చోరులు మీరు వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగ భావించి చప్పున బదులివ్వండి చప్పున బదులివ్వండి

ఆనందం

Image
చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం ఆశల జండా ఎగరేసే స్వాతంత్ర్యం ఆనందం చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం ఊరించే ఊహల్లో ఊరేగడమే ఆనందం కవ్వించే కల కోసం వేటాడమే ఆనందం అలలై ఎగసే ఆనందం అలుపే తెలియని ఆనందం ఎదరేమున్న ఎవరేమన్నా దూసుకుపోతూ ఉంటే ఆనందం చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం ప్రతి అందం మనకోసం అనుకోవటమే ఆనందం రుచి చూద్దాం అనుకుంటే చేదైనా అది ఆనందం ప్రేమించటమే ఆనందం Fail అవ్వటమే ఆనందం కలలే కంటూ నిజమనుకుంటూ గడిపే కాలం ఎంతో ఆనందం చికి చికి చాం చికి చంచంచం ప్రతి నిమిషం ఆనందం చికి చికి చాం చికి చంచంచం మనసంతా ఆనందం రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం ఆశల జండా ఎగరేసే స్వాతంత్ర్యం ఆనందం