Akaasam enatidho


ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే

అవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
అవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే

ఏ పూవు ఏ తీవిదన్నది ఏనాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు వయసుకు
అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవిచూడమనగా

పరువాలే ప్రణయాలై ..స్వప్నాలే స్వర్గాలై
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలరెను

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే
అవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే

ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించునో
హృదయాలే తెరతీసి తనువుల
కలబోసి మరపించమనగా
కౌగిలిలో చెరవేసి మధనుని
కరగించి గెలిపించమనగా

మోహాలే దాహాలై ..సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే
అవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

http://youtube.com/watch?v=kb-lqDK4KOc

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki