దేవతలారా రండి..


దేవతలారా రండి మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించె
వరున్నే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించె
వరున్నే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండి
శివ పార్వుతులేమో ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోను మా కధలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి
శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి
మా ముంగిళిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి
మా చక్కని జంటచుక్కల తోట పరిపాలించాలి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించె
వరున్నే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండి
తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు
నీ వగలే నగలంటు గారాలే కురిపిస్తాడు
తన ఇంటికి కళ తెచ్చే మహలక్ష్మిగ పూజిస్తాడు
తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు
ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతి చోట
నిధి నిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించె
వరున్నే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండి
దేవతలారా రండి మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే నా తోడుని పంపించండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించె
వరున్నే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండి

Comments

Popular posts from this blog

Eppudu oppukovaddura otami...

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki