Posts

Lalitha priya kamalam

Image
లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని . ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని .. అమృత కలశముగా ప్రతినిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది. రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం ...కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేలా నింగి కలిపే బంధం ఇంద్ర చాపం... కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరుల వనం మన హృదయం...వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను.... తేటి స్వరముల మధువులు చిలికెను... తేటి పలుకుల చిలకల కిలకిల.... తీగ సొగసులు తొణికిన మిలమిల..... పాడుతున్నది ఎదమురళీ, రాగ చరిత గల మృదురవళి...... తూగుతున్నది మరులవనీ, లేత విరి కులుకుల నటనగని..... వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను.. కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం...... తీసే శ్వాసే ధూపం.. చూసే చూపే దీపం. కాదా మమకారం నీ పూజ కుసుమం..... మనసు హిమగిరిగా మారినది........కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము...... వీణపలికిన జిలిబిలి గమకము.... కాలి మువ్వగా నిలిచెను కాలము..... పూల పవనము వేసెను తాళము..... గేయమైనది తొలి ప్రాయం .....రాయమని మాయని మధుకావ్యం...... స్వాగతిం...

Dyryam

ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేది దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది...............

Toli Sandhya

Image
తొలిసంధ్య వేళలో.... తొలిపొద్దు పొడుపులో...తెలవారే తూరుపులో.. వినిపించే రాగం భూపాలం....యెగిరొచ్చే కెరటం సింధూరం జీవితమే రంగుల వలయం ....దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం.....వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యా రాగం ....మేలుకొలిపే అనురాగం సాగరమే పొంగుల నిలయం... దానికి ఆలయం సంధ్యా సమయం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం...లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

Busy Life

Image
అలారం మోతలతో ఉలికిపాటు మెలకువలు.... అలసిన మనసులతో కలలులేని కలత నిదురలు పోగొట్టుకుంటున్నది పోల్చుకోలేని,పొందుతున్నది పంచుకోలేని భారమయిన బిజీ జీవితాలు త్రుప్తి తెలియని చింతా చిత్తాలు.. పగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూ....రాత్రంతా ఆనందాలకు అర్ధాలు వెతుక్కుంటూ....

Bhavalu

Image
మనసు చదివే కావ్యాలెన్నో అ0దమైన నీ చిరునవ్వుల్లో భాష తెలియని భావాలెన్నో నిను చూసే నా కన్నుల్లొ కవితక0దని అ0దాలెన్నోనిను వెతికే నా ఊహల్లో కనులకే తెలియని కలలెన్నోనిను తలచిన క్షణ0లో

Darahasam

Image
అధర కాగితాలపై విరిసే సుమధుర కవిత మనసుల్ని దోచే హిమ వీచిక మ్రుదు మధుర దరహాసిక... ఓ సు0దర జ్నాపిక కలతల్ని మరిపి0చి మురిపి0చేఅనిర్వచనీయ కానుక మాట రాని మనసులకు పలుకు నేర్పేలిపిలేని భావమిదే