Oh My Friend.........


పాదమెటు పోతున్న పయనమెందాకైన...
అడుగు తడబడుతున్న..తోడు రానా..
చిన్ని ఎడబాటైన...కంటతడి పెడుతున్న ..
గుండె ప్రతి లయ లోను నేను లేనా...
ఒంటరైన..ఓటమైన వెంట నడిచే నీడ నేనా.
Oh My Friend.. తడి కన్నులనే తుడిచిన నేస్తమా....
Oh My Friend...ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా...

అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుందే...
జన్మ కంతా తీరిపోని మమతలెన్నో పంచుతుందే...
మీరు మీరు నుంచి మన స్నెహ గీతం
ఏరా ఏరా లోకి మారే...మొమాటాలే లేని కలే జాలువారే...
ఒంటరైన ఓటమైన ....వెంట నడిచే నీడ నీవే..
Oh My Friend... తడి కన్నులనె తుడిచిన నేస్తమా.
.ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా....

వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే..
నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంత వాలే..
గిల్లి కజ్జాలన్నీ ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం..
మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే...
ఒంటరైన, ఓటమైన..వెంట నడిచే నీడ నీవే...
Oh My Friend... తడి కన్నులనే తుడిచిన నేస్తమా...
Oh My Friend..... ఓడి దుడుకలలో నిలిచిన స్నేహమా

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu