ఆకాశంలో ఆశల హరివిల్లు


ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూచిన పొదరిళ్ళు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూచిన పొదరిళ్ళు

మబ్బుల్లో తూగుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికేనా

పిల్లగాలే పల్లకీగా దిక్కులన్ని చుట్టి రానా
నాకోసం నవరాగాలే నాట్యమాడెనుగా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూచిన పొదరిళ్ళు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం

శోభలీనే సోయగాన చందమామ మందిరాన
నాకోసం సురభోగాలే వేచి నిలిచెనురా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూచిన పొదరిళ్ళు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా

ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలే పూచిన పొదరిళ్ళు

http://www.youtube.com/watch?v=NJS11KEUX4c

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Eppudu oppukovaddura otami...

janaki ramula kalyananiki