వస్తాడు నా రాజు ఈ రోజు


వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన

కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన
తేలి వస్తాడు నా రాజు ఈ రోజు

వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను

వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను
ఆతని పావన పాద ధూలికై అవని అనువనువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే పాల సంద్రమై పరవశించేను

పాల సంద్రమై పరవశించేను
వస్తాడు నా రాజు ఈ రోజు

వెన్నెలెంతగ విరిసినగాని చంద్రున్ని విడిపోలేవు
కెరటాలెంతగ పొంగినగాని కడలిని విడిపోలేవు
కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే
తనువులు వేరైన దారులు వేరైన

తనువులు వేరైన దారులు వేరైన
ఆ బంధాలే నిలిచేనులే

ఆ బంధాలే నిలిచేనులే

వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తిక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన

వస్తాడు నా రాజు ఈ రోజు

http://www.youtube.com/watch?v=Up7XvyDkwv8

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki