నువ్వంటే నాకిష్టమని
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులొ శృతి కలిపి పాడగా
నీ నీడలో అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నువ్వు నా వెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తు ఉంటే మైమరుపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగా
సుదూరాల తారకా సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరికా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సన సన్నగా చేజారిపోనీయక
చూడు నా ఇంద్రజాలం వెను తిరిగి వస్తుంది కాలం
రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండి పోతే చాలుగా

Comments