సుందరము సుమదురము..


సరిగమ పదని సప్తస్వరాలు మీకు
అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు

సరిగమ పదని సప్తస్వరాలు మీకు
అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు

మనసే ఒక మార్గము
మమతే ఒక దీపము
ఆ వెలుగే మాకు దైవము

సరిగమ పదని సప్తస్వరాలు మీకు
అవి ఏడు రంగుల ఇంద్రధనుస్సులు మాకు

సుందరము సుమధురము
చందురుడందిన చందన శీతలము
మలయజ మారుత శీకరము
మనసిజ రాగ వశీకరము

సుందరము సుమధురము
చందురుడందిన చందన శీతలము

ఆనందాలే భోగాలైతే
హంసా నంది రాగాలైతే
నవవసంత గానాలేవో సాగేనులే
సురవీణా నాదాలెన్నో మోగేనులే


వేకువలో వెన్నెలలో
చుక్కలు చూడని కోనలలో
వాన కొమ్మల ఊగిన కోయిల
వెల్లువనూదిన గీతికలు

సుందరము సుమధురము
చందురుడందిన చందన శీతలము

అందాలన్ని అందే వేళ
బంధాలన్ని పొందే వేళ
కన్నుల్లో గంగ యమున పొంగేనులే
కౌగిట్లో సంగమమేదో సాగేనులే

కోరికలే చారికలై ఆడిన పాడిన సవ్వడిలో
మల్లెల తావుల పిల్లనగ్రోవులు పల్లవి పాడిన పందిరిలో

సుందరము సుమధురము
చందురుడందిన చందన శీతలము
మలయజ మారుత శీకరము
మనసిజ రాగ వశీకరము

సుందరము సుమధురము
చందురుడందిన చందన శీతలము

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki