Posts

Showing posts from 2007

Nee venta nene...

Image
నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అనువనువనువున నీవంటె నేనే తనువున మనసున ఏమైనా.. మనమే ఒకరికి ఒకరను ఈ పయననా...మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన... ముద్దుతో పాపిటలోనె దిద్దవా కస్తురీ ... ప్రేమతో పెదవుల పైనే చేయవా దస్తురీ .. చూపులే పారాణి ఊపిరే సాంబ్రాణి ... రూపమే దీపం గా రాతిరే పగలవనీ.. నీ వెంట నేనే అడుగడుగడుగున.... నీ జంట నేనే అనువనువనువున... నీవంటె నేనే తనువున మనసున ఏమైనా.. మనమే ఒకరికి ఒకరను ఈ పయననా...మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన... వెచ్చని అల్లరిలోనే సుర్యుడే కరగాలి.. చల్లని అలసటలోనే చంద్రుడేనిలవాలి.. తారకాపురమల్లే కాపురం వెలగాలి ... నిత్య సంక్రాంతల్లే జీవితం సాగాలి ... నీ వెంట నేనే అడుగడుగడుగున.... నీ జంట నేనే అనువనువనువున... నీవంటె నేనే తనువున మనసున ఏమైనా.. మనమే ఒకరికి ఒకరను ఈ పయననా...మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన... http://www.youtube.com/watch?v=m-9wf1v9OtI

Eppudu oppukovaddura otami...

Image
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి....విశ్రమించ వద్దు ఏ క్షణం---విస్మరించ వద్దు నిర్ణయం...అప్పుడే నీ జయం నిశ్చయం రా....ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...నింగి ఎంత పెద్దదయిన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా....సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా....పశ్చిమాన పొంచి ఉండి రవి ని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేధురా...గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా...నిశా విలాసమెంతసేపురా.... ఉషొదయాన్ని ఎవ్వడాపురా ...రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా... ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగుననీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు ..బ్రతుకు అంటె నిత్య ఘర్షణ ... దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..ఆశయమ్ము సారధవును రా..నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓ

jeevithanubhavam....

Image
ఏ చీకటి చెరిపెయ్యనీ కలలే కనాలి.. ఆ వేకువే దరిచేరగా నిజమవ్వాలి. ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోని ...స్నేహాల తీరమే చేరువై రాని... పదే పదే పాడుకోవాలి ..మదే ఇలా హయి రాగమే ..ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితానుభవమే .. కలతే పడకు కల నిజమయ్యె వరకు .. గెలుపే తుదకు వెలుగే లేదనుకోకు . ఊరేగని మన ఊహలే...ఆ తారలే తాకేలా ఏ చీకటి చెరిపెయ్యనీ కలలే కనాలి...ఆ వేకువే దరిచేరగా నిజమవ్వాలి.ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోని ...స్నేహాల తీరమే చేరువై రాని.. గతమే మరచి చేయ్యి కలిపేందుకు చూడు... ఎదనే పరచి ప్రేమకి పల్లవి పాడు ఏ సంకెల బంధించని చిరుగాలిల రావేలా.... ఏ చీకటి చెరిపెయ్యనీ కలలే కనాలి...ఆ వేకువే దరిచేరగా నిజమవ్వాలి.ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోని ...స్నేహాల తీరమే చేరువై రాని...పదే పదే పాడుకోవాలి ..మదే ఇలా హయి రాగమే ..ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితానుభవమే

Oh My Friend.........

Image
పాదమెటు పోతున్న పయనమెందాకైన... అడుగు తడబడుతున్న..తోడు రానా.. చిన్ని ఎడబాటైన...కంటతడి పెడుతున్న .. గుండె ప్రతి లయ లోను నేను లేనా... ఒంటరైన..ఓటమైన వెంట నడిచే నీడ నేనా. Oh My Friend.. తడి కన్నులనే తుడిచిన నేస్తమా.... Oh My Friend...ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా... అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుందే... జన్మ కంతా తీరిపోని మమతలెన్నో పంచుతుందే... మీరు మీరు నుంచి మన స్నెహ గీతం ఏరా ఏరా లోకి మారే...మొమాటాలే లేని కలే జాలువారే... ఒంటరైన ఓటమైన ....వెంట నడిచే నీడ నీవే.. Oh My Friend... తడి కన్నులనె తుడిచిన నేస్తమా. .ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా.... వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే.. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంత వాలే.. గిల్లి కజ్జాలన్నీ ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం.. మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే... ఒంటరైన, ఓటమైన..వెంట నడిచే నీడ నీవే... Oh My Friend... తడి కన్నులనే తుడిచిన నేస్తమా... Oh My Friend..... ఓడి దుడుకలలో నిలిచిన స్నేహమా http://www.youtube.com/watch?v=76YP5f6DWjc

Lalitha priya kamalam

Image
లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని . ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని .. అమృత కలశముగా ప్రతినిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది. రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం ...కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేలా నింగి కలిపే బంధం ఇంద్ర చాపం... కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరుల వనం మన హృదయం...వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను.... తేటి స్వరముల మధువులు చిలికెను... తేటి పలుకుల చిలకల కిలకిల.... తీగ సొగసులు తొణికిన మిలమిల..... పాడుతున్నది ఎదమురళీ, రాగ చరిత గల మృదురవళి...... తూగుతున్నది మరులవనీ, లేత విరి కులుకుల నటనగని..... వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను.. కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం...... తీసే శ్వాసే ధూపం.. చూసే చూపే దీపం. కాదా మమకారం నీ పూజ కుసుమం..... మనసు హిమగిరిగా మారినది........కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము...... వీణపలికిన జిలిబిలి గమకము.... కాలి మువ్వగా నిలిచెను కాలము..... పూల పవనము వేసెను తాళము..... గేయమైనది తొలి ప్రాయం .....రాయమని మాయని మధుకావ్యం...... స్వాగతిం

Dyryam

ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేది దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది...............

Toli Sandhya

Image
తొలిసంధ్య వేళలో.... తొలిపొద్దు పొడుపులో...తెలవారే తూరుపులో.. వినిపించే రాగం భూపాలం....యెగిరొచ్చే కెరటం సింధూరం జీవితమే రంగుల వలయం ....దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం.....వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యా రాగం ....మేలుకొలిపే అనురాగం సాగరమే పొంగుల నిలయం... దానికి ఆలయం సంధ్యా సమయం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం...లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

Busy Life

Image
అలారం మోతలతో ఉలికిపాటు మెలకువలు.... అలసిన మనసులతో కలలులేని కలత నిదురలు పోగొట్టుకుంటున్నది పోల్చుకోలేని,పొందుతున్నది పంచుకోలేని భారమయిన బిజీ జీవితాలు త్రుప్తి తెలియని చింతా చిత్తాలు.. పగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూ....రాత్రంతా ఆనందాలకు అర్ధాలు వెతుక్కుంటూ....

Bhavalu

Image
మనసు చదివే కావ్యాలెన్నో అ0దమైన నీ చిరునవ్వుల్లో భాష తెలియని భావాలెన్నో నిను చూసే నా కన్నుల్లొ కవితక0దని అ0దాలెన్నోనిను వెతికే నా ఊహల్లో కనులకే తెలియని కలలెన్నోనిను తలచిన క్షణ0లో

Darahasam

Image
అధర కాగితాలపై విరిసే సుమధుర కవిత మనసుల్ని దోచే హిమ వీచిక మ్రుదు మధుర దరహాసిక... ఓ సు0దర జ్నాపిక కలతల్ని మరిపి0చి మురిపి0చేఅనిర్వచనీయ కానుక మాట రాని మనసులకు పలుకు నేర్పేలిపిలేని భావమిదే