E divilo velasina


ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నా మదిలో నీవై నిండి పోయెనే

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో

పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే
నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన రాజహంసలా రావే

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో

నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగ కావ్య కన్యవై రావే

ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో

http://www.youtube.com/watch?v=_ypnwyX-SJk

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki