నవ్వాలి నీతో నడవాలి నీతో


నవ్వాలి నీతో ..నడవాలి నీతో
నెలవంక మీద నిలవాలి నీతో
ఆడాలి నీతో.. అలగాలి నీతో
హరివిల్లు మీధ ఊగాలి నీతో
తడవాలి నీతో.. ఆరాలి నీతో
గడపాలి అనుక్షణం నేనే నీతో

నవ్వాలి నీతో ..నడవాలి నీతో
నెలవంక మీద నిలవాలి నీతో

వస్తానని మాటిచ్చక కావాలని నే రాలేక
నీలొ చాలా ఆరాటాన్నే పెంచాలి
వేరే కన్యను నేనింక వంకర చూపులు చూసాకా
నీలో కలిగే అక్రోశాన్నే కాచాలి

నీ పైట గాలిని పీల్చాలి
నీ మాట తేనెను తాగాలి
నును లేత చివాట్లు తింటా నీతో

నవ్వాలి నీతో ..నడవాలి నీతో
నెలవంక మీద నిలవాలి నీతో
ఆడాలి నీతో.. అలగాలి నీతో
హరివిల్లు మీధ ఊగాలి నీతో

చీటికి మాటికి ఊరించి చిలిపితనంతో ఉడికించి
ముద్దుగ మూతిని ముడుచుకునుంటే చూడాలి
అంతకు అంత లాలించి ఆపై నీపై తలవాల్చి
బ్రతిమాలేస్తూ జతగా నీతో బ్రతకాలి

నీ వేలి కొనలను నిమరాలి
నీ కాలి ధూళిని తుడవాలి
అరచేతి గీతల్లే ఉంటా నీతో

నవ్వాలి నీతో ..నడవాలి నీతో
నెలవంక మీద నిలవాలి నీతో
ఆడాలి నీతో.. అలగాలి నీతో
హరివిల్లు మీధ ఊగాలి నీతో
తడవాలి నీతో.. ఆరాలి నీతో
గడపాలి అనుక్షణం నేనే నీతో
http://www.youtube.com/watch?v=v5dvPplbPRA

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం