ఝుమ్మంది నాదం సయ్యంది పాదం


ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాస లీల(2)


ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా(2)


చలిత లలిత పద కలిత కవిత ఎద
సరిగమ పలికించగ
స్వర మధురిమలొలికించగ
సిరి సిరి మువ్వలు పులకించగ

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాస లీల

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి(2)


ఆకాశమై పొంగే ఆవేశం
కైలాశమే వంగే నీకోసం


ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాస లీల

మెరుపుంది నాలో అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో అది నీ మూగ పిలుపు

చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాస లీల

http://www.youtube.com/watch?v=n5erM9-wt3w

Comments

Popular posts from this blog

Eppudu oppukovaddura otami...

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki