పాడనా తెనుగు పాట
పాడనా తెనుగు పాట(2)
పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాట
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో(2)
మావులో తోపులో మోపుల పైన
మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట
మధురామృతాల తేట ఒక పాట
పాడనా తెనుగు పాట
పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాట
త్యాగయ్య క్షేత్రయ్య రామదాసులు(2)
తనివి తీర వినిపించినది
నాడ నాడుల కదిలించేది
వాడ వాడల కరిగించేది
చక్కెర మాటల మూట
చిక్కని తేనెల ఊట
ఒక పాట
పాడనా తెనుగు పాట
ఒళ్ళంత ఒయ్యారి కోక
కళ్ళకు కాటుక రేఖ(2)
మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కలియాలందెలు
అల్లనల్లన నడయాడే
తెలుగు తల్లి పెట్టని కోట
తెలుగు నాట ప్రతి చోట
ఒక పాట
ఒక పాట
పాడనా తెనుగు పాట
పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాట
http://www.youtube.com/watch?v=yq8vn7A-_Jw
Comments