Siggu poobanthi


సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి
మొగ్గ సింగారం ఇరిసే సుధతి మీనాచ్చి
సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి
సిగ్గు...

సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి(2)
మొగ్గ సింగారం ఇరిసే సుధతి మీనాచ్చి

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగ(2)
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగ

సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి

విరజాజి పూల బంతి అరసేత మోయలేని(2)
సుకుమారి ఈ సిన్నదేనా
శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేనా

ఔర అని రామయ్య కన్నులు
మేలవాడి నవ్విన సిన్నెలు (2)

సూసి అలకలొచ్చిన కలికి(2)
ఏసినాది కులుకుల మొలికి

సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి(2)
మొగ్గ సింగారం ఇరిసే సుధతి మీనాచ్చి

శిరసొంచి కూరుసున్న
గురి సూసి సేరుతున్న(2)

చిలకమ్మ కొనసూపు సౌరు
గొండు మల్లె సెందు జోరు

సేరే ఆ సూపుల తళుకు
ముసురుతున్న రామయ్య రూపు(2)

మెరిసే నల్ల మబ్బైనాది(2)
వలపు జల్లు వరదైనాది

సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి(2)
మొగ్గ సింగారం ఇరిసే సుధతి మీనాచ్చి

సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగ(2)
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగ

సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి

http://www.youtube.com/watch?v=KvfKRBYwEhE

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu