Konda gaali tirigindi


కొండగాలి తిరిగింది(2)
గుండె ఊసులాడింది
గోదావరి వరద లాగ
కోరిక చెలరేగింది
ఆఅ ఆఆ ఆఅ ఆఅ...

పుట్టమీద పాలపిట్ట
పొంగిపోయి కులికింది(2)
గట్టు మీద కన్నె లేడి
గంతులేసి ఆడింది

పట్ట పగలు సిరివెన్నెల
భరతనాత్య మాడింది
పట్టరాని లేత వలపు
పరవశించి పాడింది (2)

కొండగాలి తిరిగింది
గుండె ఊసులాడింది
గోదావరి వరద లాగ
కోరిక చెలరేగింది
ఆఅ ఆఆ ఆఅ ఆఅ...

మొగలి పూల వాసనతో
జగతి మురిసి పొయింది(2)
నాగమల్లి పూలతో
నల్లని జడ నవ్వింది

పడుచుదనం అందానికి
తాంబూలమిచ్చింది(2)
ప్రాప్తమున్న తీరానికి
పడవ సాగిపోయింది

కొండగాలి తిరిగింది
గుండె ఊసులాడింది
గోదావరి వరద లాగ
కోరిక చెలరేగింది
ఆఅ ఆఆ ఆఅ ఆఅ...

http://www.youtube.com/watch?v=O7uTZmz9fBw

Comments

Padmarpita said…
పడుచుదనం అందానికి
తాంబూలమిచ్చింది(2)
ప్రాప్తమున్న తీరానికి
పడవ సాగిపోయింది...
ఈ లైన్లు నాకు చాలా ఇష్టం!
Swapna said…
Thank u...I like the melody of entire song..paata vintunte godavari lo padava meeda vellinantha anandam gaa undhi...

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki