తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష


దినదినము వర్దిల్లు తెలుగు దేశం
దీప్తులను వెదజల్లు తెలుగు తేజం

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష(2)
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష(2)

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష

భామల్లార తుమ్మెద భామలమ్మల్లార తుమ్మెద
హంసల్లు చిలకల్లు తుమ్మెద ఆకశమందెగిరె తుమ్మెద
కొంగల్లు పిచికల్లు తుమ్మెద గుడిచుట్టు తిరిగాయి తుమ్మెద
కొలనులో తామరలు తుమ్మెద కోరి వికసించాయి తుమ్మెద
హోఓ ఓ

మయూరాల వయారాలు మాటలలో పురివిప్పును
పావురాల కువకువలు పలుకులందు నినదించును(2)

సప్తస్వరనాదసుధలు నవరసభావాలమణులు(2)
చారు తెలుగు సొగసులోన జాలువారు జాతీయం

తేనె కన్నా తీయనిదీ తెలుగు భాష
దేశ భాషలందు లెస్స తెలుగు భాష
తేనె కన్నా తీయనిదీ తెలుగు భాష

అమరావతి సీమలో కమనీయ శిలామంజరి
రామప్ప గుడి గోడల రమణీయ కళారంజని(2)

అన్నమయ్య సంకీర్తనం, క్షేత్రయ్య శృంగారం(2)
త్యాగరాజు రాగమధువు తెలుగు సామగానమయం

తేనె కన్నా తీయనిదీ తెలుగు భాష (2)
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!

తేనె కన్నా తీయనిదీ తెలుగు భాష

http://www.youtube.com/watch?v=88Ua2ZofVJQ

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu