Mukunda mukunda


ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృందావనంలో వరంగ

ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృందావనంలో వరంగ

వెన్నదొంగవైన మన్ను తింటివా
కన్నె గుండె ప్రేమ లయల మృదంగానివా

ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృందావనంలో వరంగ

జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే
నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే

ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృందావనంలో వరంగ

మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి
కూర్మ రూపధారివి నీవై భువిని మోసినావే
వామునుడై పాదమునెత్తి నింగి కొలిచినావే
నరసింహుడి అంశే నీవై హిరణ్యుడి చీల్చావు
రావణుడు తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లే వేణువునూది ప్రేమను పంచావు

ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం మేమే
నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైన నేనే
మదిలోన ప్రేమ నీదే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడరా
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద
స్వరంలో తరంగ బృందావనంలో వరంగ

http://www.youtube.com/watch?v=Aq95Le3Z1kM

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki