Siri siri muvvalu


సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు
చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు
కలబోసి చేసినవి కిలకిల నవ్వులు
వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు

దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు
ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు

సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు
చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు

అల్లరంత సిరిమువ్వలై ఘల్లుఘల్లు మంటే
నిలువలేక నిశబ్దమే విసుగు పుట్టి పోదా
సంతోషము కూడా తనకి చిరునామా అవ్వాలని
కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మన కళ్ళని

ఈ మణికాంతి వెలుగుతు ఉంటే
ఈ మణికాంతి వెలుగుతు ఉంటే
చీకటి రాదే కన్నులకెదురుగ

సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు
చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు
కలబోసి చేసినవి కిలకిల నవ్వులు
వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు

దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు
ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు

సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు
చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki