Adigadigo aasalu reputhu


అదిగదిగో ఆశలు రేపుతూ ఎదురుగ వాలే ఎన్నో వర్ణాలు
ఇదిగిదిగో కలలను చూపుతూ ఎదలను ఏలే ఏవో వైనాలు

ఎగిరొచ్చే ఆ గువ్వలో చిగురించే ఈ నవ్వులా
సాగే సావాసం...
ప్రతి హృదయంలో ఆ కల నిజమైతే ఆపేదెలా
పొంగే ఆనందం...

కలైనా ఇదివో కధైనా రచించే ఏవో రాగాలే

ఈ సమయం ఏ తలపులనో తన గురుతుగ విడిచెళ్తుందో
ఈ మనసుకు జత ఏదంటే తను ఏమని బదులిస్తుందో

వరమనుకో దొరికిన జీవితం
ఋతువులు వేసే రంగుల ఓ చిత్రం

ఈ పయనం ఏ మలుపులో తన గమ్యం నే చేరునో
చూపే దారేది....
వరించే ప్రతి క్షణాన్ని జయించే స్నేహం తోడవనీ

తన గూటిని వెదికే కళ్ళు
గమనించవు ఎద లోగిళ్ళు
తలవంచిన మలి సంధ్యల్లో
సెలవడిగెను తొలి సందళ్ళు

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki