Posts

Showing posts from February, 2011

Siggu poobanthi

Image
సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుధతి మీనాచ్చి సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి సిగ్గు... సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి(2) మొగ్గ సింగారం ఇరిసే సుధతి మీనాచ్చి సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగ(2) రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగ సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి విరజాజి పూల బంతి అరసేత మోయలేని(2) సుకుమారి ఈ సిన్నదేనా శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేనా ఔర అని రామయ్య కన్నులు మేలవాడి నవ్విన సిన్నెలు (2) సూసి అలకలొచ్చిన కలికి(2) ఏసినాది కులుకుల మొలికి సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి(2) మొగ్గ సింగారం ఇరిసే సుధతి మీనాచ్చి శిరసొంచి కూరుసున్న గురి సూసి సేరుతున్న(2) చిలకమ్మ కొనసూపు సౌరు గొండు మల్లె సెందు జోరు సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ్య రూపు(2) మెరిసే నల్ల మబ్బైనాది(2) వలపు జల్లు వరదైనాది సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి(2) మొగ్గ సింగారం ఇరిసే సుధతి మీనాచ్చి సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగ(2) రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగ సిగ్గు ఫూబంతి ఇసిరే సీతమాలచ్చి http://www.youtube.com/watch?v=KvfKRBYwEhE

Konte chuputho

Image
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే(2) మాట రాని మౌనం మనసే తెలిపే ఎద చాటు మాటు గానం కనులే కలిపే ఈవేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రెమేనేమో ఆది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలిపాటై నాలో పలికినది పగలే రేయైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగని అందని జాబిల్లి అందిన ఈవేళ ఇరువురి దూరలు కరగనీ ఒడిలో వాలలనున్నదీ వద్దని సిగ్గాపుతున్నదీ తడబడు గుండెలలొ మోమాటమిదీ కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగ చల్లగ దొచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదొ మాయ చేసి అంతలోనె మౌనమేలనే కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరవు చిలిపిగా నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటు తెలుపగా చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచెనే చావుకు భయపడనే నువ్వుంటె చెంత కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రెమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలిపాటై నాలో పలికినదీ మాట రాని మౌనం మనసీ తెలిపే ఎద చాటు మాటు గానం కనులే కలిపే ఈవేళ కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుత

Konda gaali tirigindi

Image
కొండగాలి తిరిగింది(2) గుండె ఊసులాడింది గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది ఆఅ ఆఆ ఆఅ ఆఅ... పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది(2) గట్టు మీద కన్నె లేడి గంతులేసి ఆడింది పట్ట పగలు సిరివెన్నెల భరతనాత్య మాడింది పట్టరాని లేత వలపు పరవశించి పాడింది (2) కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది ఆఅ ఆఆ ఆఅ ఆఅ... మొగలి పూల వాసనతో జగతి మురిసి పొయింది(2) నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది(2) ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరద లాగ కోరిక చెలరేగింది ఆఅ ఆఆ ఆఅ ఆఅ... http://www.youtube.com/watch?v=O7uTZmz9fBw

Repalle vechenu

Image
వ్రేపల్లె వేచెను వేణువు వేచెను (2) వనమల్లా వేచెను రా నీ రాక కోసం నిలువెల్ల కనులై(2) ఈ రాధ వేచేను రా రావేలా రావేలా కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని(2) గున్నమామి పూయనన్నది నీవు రావని కాటుక కన్నీటి జాలుగ జాలి జాలిగ(2) కదలాడె యమునా నది నీ రాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేను రా రావేలా రావేలా మా వాడ అంటున్నది స్వామి వస్తాడని(2) నా నీడ తానన్నది రాడు రాడేమని రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా(2) రావేల చిరు జల్లుగా నీ రాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచేను రా రావేలా రావేలా http://www.youtube.com/watch?v=smhsk3Ebw3s

Sri Ramuni charithamunu

Image
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా (2) చెలుమీర పంచవటి సీమలో మమ కొలువుచేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరే రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా రాముగని ప్రేమగొనె రావణు చెల్లి ముకుచెవులు గోసె సౌమిత్రి రాసిల్లి రావణుడామాట విని పంతము పూని మైథిలిని కొనిపోయే మాయలు పన్ని శ్రిరాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ మృకుచేసెను సుగ్రీవుని రామ వచన మహిమ ప్రతిఉపస్థితి చేయమని పలికెను సఖులా హనుమంతుడు లంక జేరి వెదికెను నలు దిసలా శ్రిరాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా ఆఆఆఆఆఆ నాధా .....రఘు నాధాఆఆఆఆఆఆఆ పాహి పాహి పాహి అని అశోక వనిని శోకించే సీత(2) దరికిగని ముద్రిక గొని తెలిపె విభుని బాధా ఆ జనని శిరోమణి అందుకుని పావని (2) లంక గోర్చి రాముని కడకేగెను రివురివ్వుమని శ్రిరాముని చరితమును తెలిపెదమమ్మా ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా దశరథ సూతుడు లంకను దాచి దశకంటుని తలలను కోసి (2) ఆతని తమ్ముని రాజుని చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలుని చూసి శీల పరీక్షను కోరె రఘుపతి అయోనిజ

పాడనా తెనుగు పాట

Image
పాడనా తెనుగు పాట(2) పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో(2) మావులో తోపులో మోపుల పైన మసలే గాలుల గుసగుసలో మంచి ముత్యాల పేట మధురామృతాల తేట ఒక పాట పాడనా తెనుగు పాట పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట త్యాగయ్య క్షేత్రయ్య రామదాసులు(2) తనివి తీర వినిపించినది నాడ నాడుల కదిలించేది వాడ వాడల కరిగించేది చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట ఒక పాట పాడనా తెనుగు పాట ఒళ్ళంత ఒయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ(2) మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు ఘల్లు ఘల్లున కలియాలందెలు అల్లనల్లన నడయాడే తెలుగు తల్లి పెట్టని కోట తెలుగు నాట ప్రతి చోట ఒక పాట ఒక పాట పాడనా తెనుగు పాట పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట http://www.youtube.com/watch?v=yq8vn7A-_Jw

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష

Image
దినదినము వర్దిల్లు తెలుగు దేశం దీప్తులను వెదజల్లు తెలుగు తేజం తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష(2) దేశ భాషలందు లెస్స, తెలుగు భాష(2) తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష భామల్లార తుమ్మెద భామలమ్మల్లార తుమ్మెద హంసల్లు చిలకల్లు తుమ్మెద ఆకశమందెగిరె తుమ్మెద కొంగల్లు పిచికల్లు తుమ్మెద గుడిచుట్టు తిరిగాయి తుమ్మెద కొలనులో తామరలు తుమ్మెద కోరి వికసించాయి తుమ్మెద హోఓ ఓ మయూరాల వయారాలు మాటలలో పురివిప్పును పావురాల కువకువలు పలుకులందు నినదించును(2) సప్తస్వరనాదసుధలు నవరసభావాలమణులు(2) చారు తెలుగు సొగసులోన జాలువారు జాతీయం తేనె కన్నా తీయనిదీ తెలుగు భాష దేశ భాషలందు లెస్స తెలుగు భాష తేనె కన్నా తీయనిదీ తెలుగు భాష అమరావతి సీమలో కమనీయ శిలామంజరి రామప్ప గుడి గోడల రమణీయ కళారంజని(2) అన్నమయ్య సంకీర్తనం, క్షేత్రయ్య శృంగారం(2) త్యాగరాజు రాగమధువు తెలుగు సామగానమయం తేనె కన్నా తీయనిదీ తెలుగు భాష (2) దేశ భాషలందు లెస్స, తెలుగు భాష! తేనె కన్నా తీయనిదీ తెలుగు భాష http://www.youtube.com/watch?v=88Ua2ZofVJQ

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం

Image
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాస లీల(2) ఎదలోని సొదలా ఎలదేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా(2) చలిత లలిత పద కలిత కవిత ఎద సరిగమ పలికించగ స్వర మధురిమలొలికించగ సిరి సిరి మువ్వలు పులకించగ ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాస లీల నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటియించు నీవని తెలిసి(2) ఆకాశమై పొంగే ఆవేశం కైలాశమే వంగే నీకోసం ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాస లీల మెరుపుంది నాలో అది నీ మేని విరుపు ఉరుముంది నాలో అది నీ మూగ పిలుపు చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు ఈ పొంగులే ఏడు రంగులుగా ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాస లీల http://www.youtube.com/watch?v=n5erM9-wt3w