శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ


శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....

పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా

పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
పడమర పడగలపై మెరిసే తారలకై

పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రికి వరించకే సంధ్య సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై

తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ

నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ
సిరిసిరిమువ్వ... సిరిసిరిమువ్వ....

తన వేళ్ళే సంకెళ్ళై కదల లేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలు దిక్కుల
ఆనందపు గాలివాలు నడపని నిన్నిలా
ప్రతిరోజొక నవ గీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా

పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

చలిత చరణ జరితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాశం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం

నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం

పరుగాపక పయనించవె తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా

స్వధర్మే నిధనం శ్రేయహా
పరధర్మో భయావహా

http://www.youtube.com/watch?v=Wa8bvN8Q0DY

Comments

Shashank said…
ఈ సినిమాలో ప్రతి పాట ఒక ఆణిముత్యమే! నాకు ఈ పాట చాలా చాలా చాలా ఇష్టం.
ఈ వాక్యం ఎంతా బాగుంటదో.. శాస్త్రి గారు కలం నుండి వెలువడిన ఇంకో మహత్తరమైన పదజాలం.
"నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం

గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం"
Swapna said…
Thanku Shashank..I'm also great fan of sastry gaaru....ee song raasina manchi meaning untundhi dhaantlo
Unknown said…
ఈ పాటకు అక్షర లక్షలు అయినా తక్కువే

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki