Sri Ramuni charithamunu
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా (2)
చెలుమీర పంచవటి సీమలో
మమ కొలువుచేయ సౌమిత్రి ప్రేమతో
తన కొలువు తీరే రాఘవుడు భామతో
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా
రాముగని ప్రేమగొనె రావణు చెల్లి
ముకుచెవులు గోసె సౌమిత్రి రాసిల్లి
రావణుడామాట విని పంతము పూని
మైథిలిని కొనిపోయే మాయలు పన్ని
శ్రిరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా
రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ
మృకుచేసెను సుగ్రీవుని రామ వచన మహిమ
ప్రతిఉపస్థితి చేయమని పలికెను సఖులా
హనుమంతుడు లంక జేరి వెదికెను నలు దిసలా
శ్రిరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా
ఆఆఆఆఆఆ నాధా .....రఘు నాధాఆఆఆఆఆఆఆ
పాహి పాహి
పాహి అని అశోక వనిని శోకించే సీత(2)
దరికిగని ముద్రిక గొని తెలిపె విభుని బాధా
ఆ జనని శిరోమణి అందుకుని పావని (2)
లంక గోర్చి రాముని కడకేగెను రివురివ్వుమని
శ్రిరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా
దశరథ సూతుడు లంకను దాచి
దశకంటుని తలలను కోసి (2)
ఆతని తమ్ముని రాజుని చేసి
సీతను తెమ్మని పలికే
చేరవచ్చు ఇల్లాలుని చూసి
శీల పరీక్షను కోరె రఘుపతి
అయోనిజపైనే అనుమానమా
ధర్మ మూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత(2)
దృతరాగ్నుడు చల్లబడి వ్రాగించెను వాత(2)
సురలు పొగడ ధరినిజతో పురికి తరలే రఘు నేత
శ్రిరాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కధ వినుడోయమ్మా(2)
http://www.youtube.com/watch?v=u6MQfUklh8Y
Comments
హుతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత.. అనుకుంటా నండీ