hayire hayire


హాయిరే హాయిరే సరిగమ హొలి
ఆడుతూ పాడితే పదనిస కేళి
జాబిలి రాతిరి తళుకుమనాలి
చీకటి పాపిట తిలకమవ్వాలి

ఎదిగిన చెట్టు చేమ నిన్నేమనాలి
పుడమికి పచ్చా చీర నువ్వే కావాలి
మెరుపుల మొగ్గ మొక్క నిన్నేమనాలి
పెదవుల సిగ్గు నిగ్గు నువ్వేననాలి

పూసే పువ్వా నిన్నేమని అననే
బోసి నవ్వు నీదేనంటే వినవే
మల్లే తీగా నీదే గొప్ప గుణమే
నీలా అల్లుకుంటే చాలు చెలిమే

ఓఓ మెలికలు పొయే నది కులుకుల లోనా
కులుకుతు పొయే ఒక చెలి నడకుంది
కలికి ముంగురులే మేఘములే లే
చెలియా నీ నడుమే ఆ మెరుపే లే

ఎగసిన ఊహలకే కన్నూలుంటే చాలు
కనపడవా మనకే ఎన్నొ ఎన్నొ అందాలు
గుండే ఉంటే నువ్వే చూడు తడిమి
అమ్మతనం నిండి ఉంది పుడమి

గువ్వా గువ్వా నువ్వే చెప్పు నిజమే
నీలో కూడ ఉంది అమ్మాయిజమే
ఓ ఓ ఓ తొలకరిలోనా తొలి తకధిమి లోనా
తళతళ లాడే చెలి పరువం లోనా
మురిసి ఆకశమే నీ వశమాయే

బిగిసిన ఆ సొగసే పరవశమాయే

చినుకులు ధారలుగా మరి పొయే వాన
అలకలు తీరెనుగా గుండెల్లోనా తిళ్ళానా
కొండా కోనా అందాలన్ని చెలికే
కన్నే పిల్లే కాదా వాన చినుకే
నల్లా నల్లా మబ్బు చాటూ తొలిగే
పిల్ల జల్లా వెన్నెలేదో వెలిగే

హాయిరే హాయిరే సరిగమ హొలి
ఆడుతూ పాడితే పదనిస కేళి
జాబిలి రాతిరి తళుకుమనాలి
చీకటి పాపిట తిలకమవ్వాలి

ఎదిగిన చెట్టు చేమ నిన్నేమనాలి
పుడమికి పచ్చా చీర నువ్వే కావాలి
మెరుపుల మొగ్గ మొక్క నిన్నేమనాలి
పెదవుల సిగ్గు నిగ్గు నువ్వేననాలి

పూసే పువ్వా నిన్నేమని అననే
బోసి నవ్వు నీదేనంటే వినవే
మల్లే తీగా నీదే గొప్ప గుణమే
నీలా అల్లుకుంటే చాలు చెలిమే

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki